హెలికాప్టర్ లాంటి కారులో పెళ్లి ఊరేగింపు- ఎగబడ్డ జనం, వీడియో వైరల్ - భిన్నంగా వివాహా ఊరేగింపు
🎬 Watch Now: Feature Video
Published : Dec 7, 2023, 10:50 AM IST
Car Helicopter Used In Marriage Procession : పెళ్లిలో వధువు ఊరేగింపును కారులో జరుపుతుంటారు ఎక్కువ మంది. ఆర్థికంగా బలంగా ఉన్నవాళ్లు అయితే హెలికాప్టర్లలో వధువును వరుడి ఇంటికి తీసుకురావడమూ చూసుంటాం. అయితే ఉత్తర్‌ప్రదేశ్‌లో మహారాజ్‌గంజ్‌కు చెందిన ఓ వరుడు భిన్నంగా ఆలోచించాడు. కాబోయే భార్యను హెలికాప్టర్లా ఉండే ఓ కారులో తీసుకెళ్లాడు.
ఇంతకీ ఏం జరిగిందంటే?
సిద్ధార్థ్ నగర్ జిల్లాకు చెందిన మతియాజ్ అహ్మద్‌కు మహారాజ్‌గంజ్ జిల్లాలోని నౌతన్వా పట్టణంలో బుధవారం వివాహం జరిగింది. ఈ క్రమంలో వివాహ ఊరేగింపులో తనకు కాబోయే భార్యను గ్రాండ్‌గా పెళ్లి వేదిక వద్దకు తీసుకురావాలని అహ్మద్ ప్లాన్ చేశాడు. హెలికాప్టర్లా ఉండే కారును బుక్ చేసుకుని కాబోయే భార్యను ఊరేగింపుగా మండపానికి తీసుకొచ్చాడు. ఈ క్రమంలో విమానంలో ఉన్న కారును చూసుకేందుకు జనాలు ఎగబడ్డారు. కొందరు సెల్ఫీలు సైతం దిగారు. అహ్మద్ పెళ్లిలో విమానంలా ఉండే కారు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రస్తుతం విమానంలో ఉన్న కారు వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
కొన్నాళ్ల క్రితం హెలికాఫ్టర్‌లా ఉన్న కారును చూసి తనకు కాబోయే భార్యను ఇలాంటి వాహనంలోనే తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నానని వరుడు మతియాజ్ అహ్మద్ తెలిపాడు. ఇప్పుడు తన కల సాకారమైందని అన్నాడు. అలాగే హెలికాప్టర్లా తన కారును తయారుచేసినప్పటి నుంచి బుకింగ్‌లు బాగా పెరిగాయని కారు యజమాని తెలిపాడు. కారు బుకింగ్ కోసం ప్రజలు అడిగిన ధరను చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నాడు.