Moving Car Catches Fire in Hyderabad : కదులుతున్న కారులో చెలరేగిన మంటలు.. చూస్తుండగానే..! - Madhapur Car Fire accident
🎬 Watch Now: Feature Video
Moving Car Catches Fire in Madhapur : కదులుతున్న ఓ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగిన ఘటన హైదరాబాద్ మాదాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. డ్రైవర్ అప్రమత్తం కావడం వల్ల పెను ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళితే.. మాదాపూర్ పీఎస్ పరిధిలో కదులుతున్న ఓ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్.. వెంటనే కారు దిగిపోయాడు. చూస్తుండగానే.. మంటలు కారును చుట్టుముట్టాయి. దట్టమైన పొగలతో కారు పూర్తిగా దగ్ధమైంది.
వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బంది, పోలీసులకు సమాచారం అందించగా.. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ప్రమాదానికి గురైన TS 10 EE 3363 నంబర్ గల ఐ-20 కారు.. మాదాపూర్ నుంచి జేఎన్‌టీయూ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు, ప్రాణనష్టం సంభవించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదంతో కాసేపు ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. ఇంజిన్లో షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.