Cab Theft Case in Pathancheru : క్రైమ్ బ్రాంచ్ పోలీస్​నని చెప్పాడు.. బిర్యానీ తెమ్మని చెప్పి కారు దొంగిలించాడు... - హైదరాబాద్​లో క్యాబ్​ దొంగతనం కేసు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 13, 2023, 3:57 PM IST

Updated : Aug 13, 2023, 4:11 PM IST

Cab Theft Case in Pathancheru  : ఓ వ్యక్తి సినిమా మాదిరిగా సీన్ క్రియేట్​ చేసి.. కారును దొంగిలించాడు. క్యాబ్​ డ్రైవర్​ దగ్గరికి వెళ్లి తాను క్రైం బ్రాంచ్​ పోలీస్​నని చెప్పి.. హైదరాబాద్​లో దించాలని కిరాయి మాట్లాడుకున్నాడు. మార్గం మధ్యలో హోటల్​ దగ్గర ఆపి క్యాబ్​ డ్రైవర్​ని బిర్యాని తెమ్మని చెప్పాడు. దీంతో డ్రైవర్​ బిర్యాని తెచ్చేలోపు.. నిందితుడు కారుతో సహా ఉడాయించాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్​చెరులో జరిగింది. బాధితుడు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా గంగాపూర్​ గ్రామానికి చెందిన నరేష్​ తన కారును జహీరాబాద్​లో కిరాయికి నడుపుతున్నాడు. ఈ క్రమంలో అతని దగ్గరకి గుర్తు తెలియని వ్యక్తి వచ్చి.. సంగారెడ్డి ఉమెన్​ పోలీస్​ స్టేషన్​లో పని ఉందని.. కారు కిరాయికి మాట్లాడుకున్నాడు. వివరాలు అడగగా.. మహారాష్ట్రకు చెందిన క్రైం బ్రాంచ్​ పోలీస్​గా పరిచయం చేసుకున్నాడు. దీంతో సంగారెడ్డి ఉమెన్​​ పోలీస్​ స్టేషన్​ ముందు ఆపి లోపలికి వెళ్లి వచ్చాడు. దీంతో పాటు ఎస్పీ కార్యాలయం వరకూ వెళ్లి అక్కడ ఫోన్​ మాట్లాడాడు. ఇవన్ని గమనించిన క్యాబ్​ డ్రైవర్​ నిందితుడు నిజంగానే పోలీస్ అని​ నమ్మేశాడు. అనంతరం నిందితుడు తనను హైదరాబాద్​లో దింపాలని డ్రైవర్​కి చెప్పాడు. దీనికి అదనంగా రూ.3వేలు ఇవ్వాలని నరేష్​ కోరితే.. ఇస్తానని చెప్పాడు. 

Car Theft Cases in Hyderabad : హైదరాబాద్​ వస్తున్న మార్గంలో పటాన్​చెరు మండలం రుద్రారం గ్రామ శివారులో ఉన్న హోటల్​ దగ్గర కారు ఆపి.. డ్రైవర్​ని బిర్యాని తీసుకురమ్మని పంపించాడు. దీంతో బాధితుడు బిర్యానీ తెస్తే.. మరో మూడు బిర్యానీలు తెమ్మని రూ.1000 ఇచ్చాడు. డ్రైవర్​ ఈసారి హోటల్​లోకి వెళ్లి.. బిర్యానీ తెచ్చే లోపు నిందితుడు కారుతో సహా పరారైయ్యాడు. దీంతో షాక్​కు గురైన డ్రైవర్​ తమ అసోసియేషన్​ వాట్సాప్​ గ్రూప్​లో తన కారు ఎక్కడైనా ఉంటే తెలియజేయాలని సందేశాన్ని షేర్​ చేశాడు. సికింద్రాబాద్​లో చూసామని.. కారులో ముగ్గురు వ్యక్తులు ఉన్నారని తోటి క్యాబ్​ డ్రైవర్లు(Cab Theft) చెప్పారు. దీంతో పటాన్​చెరు పోలీస్​ స్టేషన్​లో బాధితుడు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు జహీరాబాద్​లో ఉన్న హోటల్​ గది కోసం ఇచ్చిన ఆధార్​ కార్డు వివరాల ఆధారంగా అభినాష్‌ ప్రకాష్‌ షిండే అని పోలీసులు గుర్తించారు.

Last Updated : Aug 13, 2023, 4:11 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.