అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న సిర్పూర్‌ను అగ్రస్థానంలో నిలబెడతా : ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ - RS Praveen Kumar latest news
🎬 Watch Now: Feature Video
Published : Nov 14, 2023, 6:33 AM IST
BSP Leader RS Praveen kumar Interview : ఈసారీ అసెంబ్లీ ఎన్నికల్లో బహుజన సమాజ్‌వాది పార్టీ రెండంకెల సీట్లు సాధించబోతున్నామని.. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ధీమా వ్యక్తం చేశారు. సిర్పూర్ నుంచి బరిలో నిలిచిన ఆయన.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప నుంచి నియోజకవర్గానికి విముక్తి కల్పించడమే తన లక్ష్యమన్నారు.
బీఆర్ఎస్ పాలనలో సిర్పూర్ నియోజకరవర్గం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని దుయ్యబట్టారు. ఆంధ్రవలస పాలకుల మనస్తత్వం ఉన్న.. కోనేరు కోనప్ప వంటి నాయకుల చేతిలో నియోజకవర్గం నలిగి పోయిందని మండిపడ్డారు. తాము అధికారంలోకి రాగానే.. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు. ఈ ఎన్నికల్లో బీఎస్పీ పార్టీ.. గతంలో కంటే ఎక్కువ స్థానాలను గెలవబోతోందన్నారు. సిర్పూర్ నియోజకవర్గాన్ని అసెంబ్లీ నియోజకవర్గాల పట్టికలో మొదటి స్థానంలోనే కాకుండా.. అభివృద్ధిలోనూ మొదటి స్థానంలో నిలబెడతామన్నారు. తాము ఎన్నికల అనంతరం కీలక పాత్ర పోషిస్తామంటున్న ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌తో.. మా ప్రతినిధి ముఖాముఖి.