BRS MPs fires on Rahul Gandhi : 'రాహుల్ గాంధీ వంటి నేత అలా మాట్లాడటం కరెక్టేనా?' - రాహుల్‌గాంధీపై కే కేశవరావు ఫైర్
🎬 Watch Now: Feature Video
BRS MPs React to Rahul Gandhi Comments : ఖమ్మం సభలో రాహుల్ గాంధీ అబద్ధాలు మాట్లాడారని బీఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు ఆరోపించారు. సాగు చట్టాలపై పార్లమెంటులో బీఆర్‌ఎస్ పోరాడిందన్నారు. ఈ మేరకు పార్లమెంట్‌లో బీఆర్‌ఎస్ ఎంపీలు వాదనలను వినిపించారు. విపక్షాల భేటీకి బీఆర్‌ఎస్ వస్తే తాము రాబోమని చెప్పినట్లు రాహుల్ మాట్లాడటం.. నాయకత్వ లేమికి నిదర్శనమని కేకే విమర్శించారు. పార్లమెంట్‌లో మాట్లాడిన మాటలు కూడా వక్రీకరించడం బాధకరమన్నారు. నాయకుడుగా ఉండే వారు అందరినీ కలుపుకుని పోవాలన్నారు. ఇప్పుడు ప్రతిపక్షాలకు నాయకత్వం వహించే సామర్థ్యం బీఆర్‌ఎస్ వంటి ప్రాంతీయ పార్టీలకే ఉందని కేకే స్పష్టం చేశారు. దిల్లీలో పాలనాధికారాలపై సుప్రీం కోర్టు తీర్పునకు విరుద్ధంగా కాంగ్రెస్ వైఖరి ఉందన్నారు. అది ప్రజాస్వామ్య స్ఫూర్తికే వ్యతిరేకమని స్పష్టం చేశారు. దేశంలో రైతుల కోసం ఆలోచించే నాయకుడు కేసీఆర్ ఒక్కరేనని పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని అవమానపరిచిన తమిళనాడు గవర్నర్‌ను తొలగించాలని కేశవరావు డిమాండ్ చేశారు. పార్లమెంటులో 30 వాయిదా తీర్మానాలు, ప్రధాని, మంత్రులపై సభా హక్కుల నోటీసులు ఇచ్చింది తామేనని నామా నాగేశ్వరరావు అన్నారు. కర్ణాటకలో గెలవగానే కాంగ్రెస్ కలలు కంటుందని.. తెలంగాణలో కాంగ్రెస్ ముగిసిన అధ్యాయమని ఎంపీలు కొత్త ప్రభాకర్ రెడ్డి, బీబీ పాటిల్, ఎం.శ్రీనివాస్ రెడ్డి, రాములు, రవిచంద్ర అన్నారు.