MLA Jogu Ramanna fires on Kaushik Reddy : 'కౌశిక్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలి.. కులాన్ని దూషించడం సరికాదు' - Adilabad latest news
🎬 Watch Now: Feature Video
Kaushik Reddy comments on Mudiraj : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి ముదిరాజ్ కులాన్ని దూషించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న స్పష్టం చేశారు. కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్‌ను తాను కోరుతానని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ వ్యవహారశైలిని ఖండించిన ఆయన.. వ్యక్తి గతంగా ఉన్న కోపాలను వ్యక్తులకే పరిమితం చేయాలని.. కులాలను కించపర్చేలా మాట్లాడటం సరైన పద్ధతి కాదని హితవు పలికారు. ఇలాంటి వ్యక్తులు ఏ పార్టీలో ఉన్న ఆ రాజకీయ పార్టీలకు తీరని నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. కౌశిక్ రెడ్డిపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. దీనికి ముదిరాజ్ సామాజిక వర్గం, ప్రతినిధులు అందరూ ఏకమై ఆయనపై చర్యలు తీసుకునేలా ఒత్తిడి తేవాలని సూచించారు. ముదిరాజ్ మహసభ సభ్యులకు ఆయన సంపూర్ణ మద్దతు పలికారు. సొంత పార్టీ ఎమ్మెల్యే.. కౌశిక్ రెడ్డిపై ఆరోపణలు చేయడంతో పార్టీలో చర్చ మొదలైంది. మరోవైపు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసన రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడ ముదిరాజ్ ప్రతినిధులు ఆందోళన చేస్తున్నారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.