పార్టీలకు అతీతంగా నియోజకవర్గ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలి : ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ - prabhakar dubbaka tour

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Dec 30, 2023, 5:15 PM IST

BRS MLA Prabhakar Inaugurated Hospital in Dubbaka : పార్టీలకు అతీతంగా నియోజకవర్గ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కోరారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పోతారంలో మన ఊరు - మన బడి, నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనం, ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాలను ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం దుబ్బాకలోని వంద పడకల ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. రాష్ట్రంలో కరోనా కేసుల నేపథ్యంలో ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. కరోనా బారిన పడిన వారికి ప్రత్యేక ఐసోలేషన్ గదులను ఏర్పాటు చేయాలని వైద్యులకు తెలిపారు. ఎమ్మెల్యే ప్రభాకర్ వెంట మున్సిపల్ ఛైర్మన్ వనిత, ఎంపీపీ పుష్పలత, జడ్పీటీసీ సభ్యుడు రవీందర్, జిల్లా వైద్యాధికారి కాశీనాథ్, ఆయా శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.