మెట్రోలో మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రయాణం - ప్రయాణికులతో సరదాగా ముచ్చట - మెట్రో ఎక్కిన హరీష్ రావు
🎬 Watch Now: Feature Video


Published : Dec 31, 2023, 10:21 AM IST
BRS MLA Harish Rao Travel in Metro Train : మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు హైదరాబాద్ మెట్రో రైల్‌లో ప్రయాణించారు. ఎల్బీ నగర్ నుంచి లక్డీకపూల్ వరకు ప్రయాణం చేశారు. ఈ సందర్భంగా ప్రయాణికులతో హరీశ్‌రావు సరదాగా ముచ్చటించారు. నాగోల్ శిల్పారామం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, దాదాపు అదే సమయంలో రవీంద్ర భారతిలో అమెరికా తెలుగు సంఘం ముగింపు ఉత్సవాల కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉంది. ట్రాఫిక్ రద్దీ కారణంగా రవీంద్ర భారతి చేరుకోవడానికి ఆలస్యం అవుతుండటంతో మెట్రోలో ప్రయాణించి సమయానికి చేరుకున్నారు.
Harish Rao Metro Ride Interacts with Passengers : హరీశ్ రావు మెట్రోలో ప్రయాణిస్తూ ప్రయాణికులతో సరదాగా ముచ్చటించారు. దీంతో ప్రయాణికులు హరీశ్ రావుతో సెల్ఫీలు తీసుకునేందుకు ఆసక్తి కనబరిచారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇటీవలె అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ కూడా మెట్రోలో ప్రయాణించి కాసేపు ప్రయాణికులతో ముచ్చటించిన విషయం తెలిసిందే.