కేటీఆర్ రోడ్ షో సందర్భంగా బీఆర్ఎస్ నాయకుల మధ్య కొట్లాట - ఒక్కరికి తీవ్ర గాయాలు - KTR Road Show in Goshamahal
🎬 Watch Now: Feature Video
Published : Nov 25, 2023, 10:12 PM IST
BRS Leaders Fight in Hyderabad : హైదరాబాద్ గోషామహల్లో కేటీఆర్ రోడ్ షో సందర్భంగా... బీఆర్ఎస్ నేతల మధ్య ఘర్షణ చెలరేగింది. సుల్తాన్ బజార్లో జరిగిన ఈ గొడవలో పార్టీ నేతల మధ్య అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ఉద్యమకారుడు దిలీప్ ఘనాటేపై ఆ పార్టీకి చెందిన మాజీ కార్పొరేటర్ రామచందర్ రాజు దాడి చేశారు. పార్టీ సమావేశాలకు సమాచారం ఇవ్వలేదని ఉద్యమకారుడు దిలీప్ ఘనాటే ప్రశ్నించారు. తననే ప్రశ్నిస్తావా అంటూ దిలీప్ ఘనటేపై దాడి(BRS Leaders Godava) చేశారు. తీవ్ర రక్తస్రావం కావడంతో దిలీప్ అపస్మారక స్థితిలోకి వెళ్లారు.
Clash Between BRS Leaders in Goshamahal : దిలీప్ ఘనటేను హుటాహుటిన హైదర్ గూడ అపోలో హాస్పిటల్కు పార్టీ కార్యకర్తలు తరలించారు. పార్టీలో అన్యాయాన్ని ప్రశ్నించెందుకుకే.. దాడి చేశారని కుమారుడు సందీప్ పేర్కొన్నారు. పార్టీలో నిజమైన నాయకులకు గుర్తింపు లేకుండా పోయిందని.. దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని అన్నాడు.