సీఎం కేసీఆర్‌కు BRS నేత అదిరిపోయే గిఫ్ట్.. ఏకంగా గాల్లోనే.. - గాలిలో ఎగురుతూ కేసీఆర్‌కు శుభాకాంక్షలు
🎬 Watch Now: Feature Video
ఇవాళ తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టినరోజు. ఆయనకు అందరిలా విషెస్ చెబితే కిక్ ఏం ఉంది అనుకున్నాడో ఏమోగానీ.. ప్రత్యేకంగా నిలిచిపోయేలా శుభాకాంక్షలను వినూత్న రీతిలో చెప్పారు. సీఎం కేసీఆర్ 69వ పుట్టినరోజును పురష్కరించుకొని.. సిద్ధిపేట జిల్లా రంగనాయక్ సాగర్‌పై పారాగ్లయిడర్లతో విహరిస్తూ "హ్యాపీ బర్తడే సీఎం కేసీఆర్ సార్.. అబ్ కి బార్ కిసాన్ సర్కార్" నినాదాలతో బీఆర్ఎస్ రాష్ట్ర యువజన నాయకుడు అరవింద్ అలిశెట్టి శుభాకాంక్షలు తెలిపారు. అందరూ ఈ పారాగ్లయిడర్లను ఆసక్తితో తిలకించారు. కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నారు.
అలాగే సిద్ధిపేటలో సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. క్యాంపు కార్యాలయంలో హరీశ్‌రావు.. కేక్ కట్ చేసి అందరికీ పంచారు. అనంతరం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా కీసరలో రామలింగేశ్వరస్వామికి బీఆర్ఎస్ శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కీసర గుట్టలో మొక్కలు నాటి వివిధ కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్ పాల్గొన్నారు. తర్వాత కీసర అర్బన్ ఎకో పార్క్‌లో ఇరువురు మొక్కలు నాటారు.
హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన సంబురాలు ఘనంగా నిర్వహించారు. స్థానిక కుంకుమేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లను పంపిణీ చేశారు.క్యాంప్ కార్యాలయంలో కేక్ కట్ చేశారు. బస్టాండ్ ఆవరణలో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రజా సంక్షేమం కోసం అహర్నిశలు పనిచేసే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు.
సీఎం కేసీఆర్ జన్మదినాన్ని పురష్కరించుకొని మూడు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్యంగా క్రీడలు నిర్వహించి.. వాటిలో గెలుపొందిన వారికి బహుమానాలు అందించారు. వరంగల్‌లో నూతన సచివాలయాన్ని పోలిన భారీ సెట్ వేశారు. అందులో కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. నిజామాబాద్ జిల్లాలో రైతులు కూడా పండ్లతో కేసీఆర్ చిత్ర పటాన్ని వేశారు.