పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తేనే హక్కులను కాపాడుకోగలం : హరీశ్ రావు
🎬 Watch Now: Feature Video
BRS Leader Harish Rao on Parliament Elections : కొత్త ప్రభాకర్ రెడ్డి విజయం కార్యకర్తల విజయమని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని వేడుక మందిరంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి భారీ ఆదిత్యంతో గెలుపొందిన నేపథ్యంలో కృతజ్ఞత సభను నిర్వహించారు. ప్రత్యేక తెలంగాణ సాధనకు దుబ్బాక నియోజకవర్గం ప్రజలు చూపిన స్ఫూర్తి అనుసరణీయమైందన్నారు. కత్తిపోటుకు గురై ఆత్మస్థైర్యాన్ని కోల్పోయిన కొత్త ప్రభాకర్ తాను మనోధైర్యాన్ని కల్పించి బరిలో నిలవాలని ఆకాంక్షించినట్లు తెలిపారు. ఉద్యమాల గడ్డ దుబ్బాక బీఆర్ఎస్(BRS)కు కంచుకోట అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయించే బాధ్యత తమపై ఉందన్నారు. రైతుబంధు పథకంలో భాగంగా పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాలో జమ చేయడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని ఎద్దేవా చేశారు.
EX Minister Harish Rao Fire on Congress : హైదరాబాద్‌తో పాటు చాలా రాష్ట్రాల్లో ఇంధనం కొరత ఉందని హరీశ్ రావు(Harish Rao) అన్నారు. జాతీయ పార్టీలకు తెలంగాణ బాగోగులు అవసరం లేదని ఆరోపించారు. కేంద్రంలో అధికారం గురించి మాత్రమే బీజేపీ, కాంగ్రెస్ ఆలోచిస్తాయన్నారు. విభజన చట్టంలోని అంశాలను పదేళ్లుగా బీజేపీ అమలు చేయలేదని ధ్వజమెత్తారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని కేంద్రం ఇంకా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తేనే హక్కులను కాపాడుకోగలమని సూచించారు. రాష్ట్రానికి శ్రీరామరక్ష బీఆర్ఎస్ మాత్రమేనని పేర్కొన్నారు.