గవర్నర్ ప్రసంగం చూస్తే ఆరు గ్యారెంటీల అమలుపై అనుమానాలు వస్తున్నాయి : ఎంపీ లక్ష్మణ్ - తమిళిసై ప్రసంగంపై ఎంపీ లక్ష్మణ్ కామెంట్స్
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/16-12-2023/640-480-20282703-thumbnail-16x9-mp-laxman-on-governor-speech.jpg)
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Dec 16, 2023, 3:04 PM IST
BJP MP Laxman On Governor Assembly Speech : గవర్నర్ ప్రసంగం వాస్తవానికి దూరంగా ఉందనీ బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. ప్రభుత్వ వ్యతిరేకత ఓటు చీలిక రావడం వల్లనే కాంగ్రెస్ లాభపడిందని కానీ బలపడలేదన్నారు. ఆరు గ్యారంటీలకు నిధులు ఎలా తెస్తారో స్పష్టత లేదని పేర్కొన్నారు. ఐదున్నర లక్షల అప్పు ఉందని తెలిసే ఆరు గ్యారంటీలు ఇచ్చారు, కానీ గవర్నర్ ప్రసంగం చూస్తే వాటి అమలుపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ అధ్యక్షుడి హోదాలో ఉన్న కిషన్రెడ్డి చెప్పిందే ఫైనల్ అన్నారు. గవర్నర్ ప్రసంగంలో రైతు రుణమాఫీ, రైతుబంధు ఊసే లేదని పేర్కొన్నారు.
నల్గొండ జిల్లా చింతపల్లి పోలీస్ స్టేషన్లో లాకప్ డెత్ జరిగిందని, దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. తొలి మంత్రివర్గంలోనే మెగా డీఎస్సీపై ప్రకటన చేస్తామన్నారు అది ఏమైందని ప్రశ్నించారు. ఉచిత బస్సు ప్రయాణ భారం ఇతరవర్గాలపై పడిందన్నారు. కర్ణాటకలో జీతాలు ఇవ్వలేని స్థితిలో ఆర్టీసీ ఉందని తెలిపారు. ఇచ్చిన హామీల నుంచి కాంగ్రెస్ తప్పించుకునే ప్రయత్నం చేస్తే ఉరుకునే ప్రసక్తే లేదని, అమలు దిశగా దానిపై పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.