'ఉద్యోగాలు ఇవ్వని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించాల్సిన సమయం వచ్చింది' - ముషీరాబాద్ బీజేపీ అభ్యర్థి ఎన్నికల ప్రచారం
🎬 Watch Now: Feature Video
Published : Nov 20, 2023, 7:20 PM IST
BJP MP Laxman Election Campaign : తెలంగాణ వచ్చింది కొలువుల కోసం, హక్కులు ఇవ్వని ఈ ప్రభుత్వాన్ని గద్దెదించాల్సిన అవసరం ఉందని ఎంపీ, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గాంధీనగర్ డివిజన్ల్లోని వివేక్ నగర్, పార్దివాడ, కాపువాడ బస్తీ, నగర కేంద్ర గ్రంథాలయం, సంజీవయ్య నగర్ తదితర ప్రాంతాల్లో.. ముషీరాబాద్ బీజేపీ అభ్యర్థి పూస రాజుకు మద్దతుగా పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా ఇంటింటి ప్రచారం చేస్తూ బీజేపీ మేనిఫెస్టోను వివరించారు.
తెలంగాణ ఉద్యమంలో నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో జరిగిన పోరాటం ఫలితంగానే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన విషయాన్ని ఈ ప్రభుత్వం మంట కలిపిందని కె.లక్ష్మణ్ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ సాక్షిగా 2 లక్షలకు పైగా ఉద్యోగాలు ఉన్నాయని ప్రకటించిన సీఎం కేసీఆర్ ఏ ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని ఆయన విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం బీఎస్ఎన్ఎల్, రైల్వే తదితర ప్రభుత్వ రంగాల్లో అనేక ఖాళీలను భర్తీ చేసిందని వివరించారు. ఈ క్రమంలో నియోజకవర్గంలో సరైన సౌకర్యాలు లేక ఇబ్బందులు గురవుతున్నామని స్థానికులు ఎమ్మెల్యే అభ్యర్థి పూస రాజుకు విన్నవించారు.