BJP MP Dharmapuri Arvind fires on CM KCR : 'కోరుట్లలో 20వేల మెజార్టీతో గెలుస్తా.. ఇదే నా సవాల్'
🎬 Watch Now: Feature Video
Published : Oct 27, 2023, 6:02 PM IST
BJP MP Dharmapuri Arvind fires on CM KCR : కోరుట్లలో 20 వేల మెజార్టీతో గెలుస్తానని నిజామాబాద్ ఎంపీ, కోరుట్ల నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ వద్దనే అయస్కాంతం లేదు.. తమ వద్ద కూడా అయస్కాంతం ఉందంటూ.. తెలంగాణలో కాషాయ ప్రభుత్వం రాబోతోందని అన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్లలో బీజేపీ కార్యకర్తల సమావేశంలో అర్వింద్ పాల్గొన్నారు.
తొమ్మిదేళ్లుగా కేజీ టు పీజీ వరకు ఉచిత విద్య అమల్లో ఉంటే.. ఈరోజు అక్షరాస్యతలో తెలంగాణ ఎందుకు 31వ స్థానంలో ఉందని కేసీఆర్‌ను ప్రశ్నించారు. ఇలా అన్ని వ్యవస్థలను సర్వనాశనం చేసిన కేసీఆర్‌ను ఇంటికీ పంపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. కేసీఆర్ తెలంగాణను ఎలా మోసం చేసిండో.. ఇక్కడి ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు అహంకారంతో ఎంత ఇబ్బంది పెట్టిండో ప్రజల వద్దకు తీసుకెళ్లాలని బీజేపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా భారీ మెజారిటీతో గెలిచి.. నిజాయతీగా మీకు సర్వీసు చేయడానికి వచ్చానని ధర్మపురి అర్వింద్ అన్నారు. కోరుట్లలో ఒక్కపైసా ఖర్చు పెట్టకుండా గెలిచి.. ఆదర్శ నియోజకవర్గంగా మారుస్తానని స్పష్టం చేశారు.