ఓటేయండి అమ్మా, చేతులు, గడ్డాలు పట్టుకొని బతిమాలుతున్న నేతలు - బీజేపీ మేనిఫెస్టో 2023
🎬 Watch Now: Feature Video
Published : Nov 22, 2023, 7:06 PM IST
BJP MLA Candidate Kondeti Sridhar Election Campaign : అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతుండడంతో ప్రధాన పార్టీలు ప్రచారం ముమ్మరంగా చేస్తున్నాయి. ఓవైపు అగ్ర నేతలతో బహిరంగ సభలు నిర్వహిస్తూ.. మరోవైపు రోడ్ షోలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఈ క్రమంలో నియోజకవర్గ అభ్యర్థులు కూడా ఎన్నికల ప్రచారాన్ని తారస్థాయికి తీసుకెళ్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వర్ధన్నపేట బీజేపీ అభ్యర్థి కొండేటి శ్రీధర్ ఇంటింటి ప్రచారం చేశారు.
తన నియోజకవర్గంలోని ప్రజలకు బీజేపీ ప్రకటించిన మేనిఫెస్టోను వివరిస్తూ.. తమ పార్టీకి ఓట్లు వేసి గెలిపించాలని కొండేటి శ్రీధర్ అభ్యర్థించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రజల్ని ఏ విధంగా మభ్యపెట్టాయో వివరించారు. ఈసారి తనకే ఓటేయాలంటూ ముసలివాళ్ల చేతులు, గడ్డాలు పట్టుకొని మరీ బతిమాలుతున్నారు. వారు నీకే ఓటేస్తాం అనే వరకు వదలడం లేదు. కొండేటి శ్రీధర్ ప్రచారం చేస్తున్న తీరు ఇప్పుడు నియోజకవర్గంలో ఆసక్తిగా మారింది. ఓట్ల సమయంలో నేతలు ఇలాంటి ఫీట్లు చేస్తుంటారు కానీ.. కొండేటి తీరు మాత్రం ఇంకో మెట్టు ఎక్కినట్లుగా ఉంది.