Bjp Leaders Surrounded Gangula House: గంగుల ఇంటిని ముట్టడించిన బీజేపీ కార్యకర్తలు... - గంగుల కమలాకర్ ఇంటి ముందు బీజేపీ ఆందోళన
🎬 Watch Now: Feature Video
Published : Aug 24, 2023, 5:56 PM IST
Bjp Leaders Surrounded Gangula House: బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఇంటిని బీజేపీ నాయకులు ముట్టడించారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు. విషయం తెలుకున్న పోలీసులు మంత్రి ఇంటిని చేరుకున్నారు. ఆందోళన చేపట్టిన కమలం కార్యకర్తలను అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు నిరసనకారులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో నిరసనకారులు పోలీసులను ప్రతిఘటించారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. కార్యకర్తలు కమలాకర్ ఇంటి గేటుదూకి లోపలికివెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు వారిని అడ్డుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు. మరోవైపు నిన్న కూడా బీజేపీ రాష్ట్ర కమిటీ పిలుపుతో నాయకులు ఎక్కడికక్కడ నిరసనలకు దిగారు. బీఆరెస్ ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలను ముట్టడిస్తూ ధర్నాలు చేపట్టారు. పలు చోట్ల ఆందోళనలు నిర్వహించారు. అక్కడక్కడ ఇరుపార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణలతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆందోళనకారుల కట్టడికి తిప్పలుపడ్డ పోలీసులు... వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు.