BJP Leader Muralidhar Rao Fires on BRS : 'తెలంగాణలో కుటుంబపార్టీని.. ఓడించడమే బీజేపీ లక్ష్యం' - T BJP
🎬 Watch Now: Feature Video
Published : Oct 7, 2023, 3:30 PM IST
BJP Leader Muralidhar Rao Fires on BRS : తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ను ఓడించి.. ప్రభుత్వ ఏర్పాటే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తోందని ఆ పార్టీ మధ్యప్రదేశ్ రాష్ట్ర ఇంచార్జ్ మురళీధర్ రావు పేర్కొన్నారు. శుక్రవారం ఘట్కేసర్లో జరిగిన పార్టీ కౌన్సిల్ సమావేశాల్లో చాలా వ్యుహాత్మక అంశాలపై చర్చించినట్లు తెలిపారు.రాష్ట్ర ప్రజలు బీజేపీకి పూర్తి మెజార్టీ ఇవ్వడానికి సిద్దంగా ఉన్నారని స్పష్టం చేశారు.
BJP Leader Muralidhar Rao Comments on KCR : రాష్ట్ర ప్రభుత్వ విధానాలతో బీఆర్ఎస్పై యువత వ్యతిరేకంగా ఉందన్నారు. రాష్ట్రంలో కొత్త నాయకత్వం, కొత్త ప్రభుత్వం రావడం ఖాయమని పేర్కొన్నారు. సీఎం అనారోగ్యంగా ఉంటే ప్రారంభ కార్యక్రమాలు కేటీఆర్, హరీశ్‌రావు చేస్తున్నారని ఇంతకన్న కుటుంబ పాలనకు ఉదాహరణ ఇంకేమి కావాలన్నారు. ఏసియన్ గేమ్స్‌లో వందకు పైగా పతకాలు సాధించడం వెనుక ప్రధాని మోదీ కృషి ఉందని తెలిపారు. తెలంగాణలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.