Raja Singh on Uniform Civil Code : 'ఉమ్మడి పౌరస్మృతిని ఎవరూ ఆపలేరు' - హైదరాబాద్ తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/03-07-2023/640-480-18902227-96-18902227-1688371141172.jpg)
Raja Singh Comments on Uniform Civil Code : దేశంలో ఉమ్మడి పౌరస్మృతి త్వరలో కచ్చితంగా అమలు కాబోతుందని, దానిని ఎవరూ ఆపలేరని రాజాసింగ్ ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, పవన్ కల్యాణ్‌ను చంపాలన్న వారిని ఎమ్మెల్యే రాజాసింగ్ తనదైన శైలిలో హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్‌లో కొందరు యూనిఫామ్ సివిల్ కోడ్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారని.. లేని పక్షంలో దీనిని ప్రతిపాదించిన వారిని హతమారుస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
అలా బెదిరింపులకు పాల్పడుతున్న నేతలు ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాను కాదు కాదా.. ఆంధ్రప్రదేశ్‌లోని ఒక్క బీజేపీ కార్యకర్తను కూడా ముట్టుకోలేరన్నారు. ఒకవేళ ముట్టుకున్నా తర్వాత పర్యవసానాలు వేరేలా ఉంటాయని హెచ్చరించారు. ఆ కార్యకర్తలే మీకు సరైన బుద్ధి చెబుతారని రాజాసింగ్ పేర్కొన్నారు. దేశంలోని అన్ని మతాల వారికి ఉమ్మడి పౌరస్మృతి చట్టం ఉపయోగపడుతుందని.. కొందరు ఉద్దేశపూర్వకంగానే తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. త్వరలోనే భారత్ హిందూ రాష్ట్రంగా అవతరించనుందని తెలిపారు.