సీఎం కేసీఆర్ వెంటనే రాజీనామా చేయాలి: ఈటల రాజేందర్ - గవర్నర్‌ను కలిసిన బీజేపీ నేతలు
🎬 Watch Now: Feature Video
BJP demands that CM KCR resign: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఈ వ్యవహారంలో ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహిస్తోందని గవర్నర్‌కు ఫిర్యాదు చేసింది. డీకే అరుణ, ఈటల రాజేందర్, బూర నర్సయ్య గౌడ్, మర్రి శశిధర్‌రె సహా పలువురు నేతలతో కూడిన బృందం గవర్నర్‌ను కలిశారు.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పేపర్ లికేజీపై అనుమానాలు ఉన్నాయని.. పబ్లిక్ సర్వీస్ కమీషన్లో సీసీ కెమెరాలు పనిచేయకపోవడం ఏంటని బీజేపీ నేతలు ప్రశ్నించారు. కేసీఆర్‌కు రాజకీయాలు, అధికారంపై ఉన్న ఆసక్తి నిరుద్యోగుల జీవితాలపై లేదని దుయ్యబట్టారు.
"ప్రభుత్వం ఇవాళ నిద్రలో ఉంది. అందుకే మా పార్టీ తరపున గవర్నర్‌ను కలిశాం. గవర్నర్ జోక్యం చేసుకొని నిరుద్యోగ యువతుకు న్యాయం చేయాలి. దీనిపై సీఎం కేసీఆర్ నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్‌తో పాటుగా కమిషన్ సభ్యులు కూడా రాజీనామా చేయాలి. నిరుద్యోగులకు రూ. లక్ష రూపాయాలు ఇవ్వాలి."- ఈటల రాజేందర్, బీజేపీ ఎమ్మెల్యే