ముందొకరు.. వెనుకొకరు.. ఇద్దరు అమ్మాయిలతో​ స్టంట్స్​.. అడ్డంగా బుక్కైన యువకుడు - ముంబయిలో అమ్మాయిలతో యువకుడి డెంజర్ బైక్​ స్టంట్స్​

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Apr 3, 2023, 11:37 AM IST

ఓ యువకుడు ఇద్దరు యువతులను.. బైక్​పై కూర్చోబెట్టుకుని ప్రమాదకరంగా డ్రైవ్​ చేశాడు. బైక్​ ట్యాంకుపై రివర్స్​లో ఒకరిని.. వెనుక ఒకరిని కూర్చోబెట్టుకుని రహదారిపై స్టంట్స్​​ చేశాడు. బైక్​ను​ గాల్లోకి లేపి.. వెనుక టైర్​పై ప్రమాదకర విన్యాసాలు​ చేశాడు. ఎలాంటి రోడ్డు భద్రతా నియమాలు పాటించకుండా.. ఇతరులకు హాని కలిగేలా బైక్​ నడిపాడు. ఈ ఘటన ముంబయిలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్​ ప్రాంతంలో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అయింది. ఈ విషయాన్ని సీరియస్​గా తీసుకున్న ముంబయి పోలీసులు.. నిందితుడి కోసం ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి గాలించారు. పక్కా సమాచారంతో 24 ఏళ్ల నిందితుడిని ఆదివారం అరెస్టు చేశారు. అతడిపై ఇండియన్​ పీనల్​ కోడ్​లోని సెక్షన్ 308, మోటారు వాహనాల చట్టం కింద కేసు నమోదు చేశారు. తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నామని పోలీసులు తెలిపారు. కాగా, ఇదివరకే ఆ యువకుడిపై ఆంటోప్ హిల్, వడాలా టీటీ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయని వెల్లడించారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.