Biggest Durga Mata Idol in Hyderabad : హైదరాబాద్లో 55 అడుగుల ఎకో ఫ్రెండ్లీ దుర్గామాత.. దేశంలోనే అతిపెద్దది.. - భారతదేశంలో అతిపెద్ద దుర్గామాత విగ్రహం 2023
🎬 Watch Now: Feature Video
Published : Oct 17, 2023, 3:42 PM IST
Biggest Durga Mata Idol in Hyderabad : దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్ కోఠిలోని ఇసామియా బజార్లో ఏర్పాటు చేసిన 55 అడుగులు దుర్గా మాత విగ్రహం అందరినీ ఆకట్టుకుంటోంది. భారత్‌లోనే అది అతిపెద్ద విగ్రహంగా రికార్డుల్లోకి ఎక్కింది. 2000 సంవత్సరం నుంచి ఈ ప్రాంతంలో ప్రతిఏటా విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేస్తున్నారు. ఏటా విగ్రహం ఎత్తును క్రమేపీ పెంచుకుంటూ.. ఒక్కోసారి తగ్గిస్తూ వస్తున్నారు. ఈ ఏడాది పర్యావరణ హితంగా మట్టి, గడ్డితో ప్రతిమను తయారు చేశారు.
ఉత్సవం చివరి రోజు ఊరేగింపుగా తీసుకెళ్లి స్థానిక విక్టోరియా మైదానంలో నీటితో తడిపి నిమజ్జనం చేస్తామని నిర్వాహకులు తెలిపారు. భారీ విగ్రహం కావడంతో నగరంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు.. అమ్మవారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో వస్తున్నారు. ప్రతి రోజూ అమ్మవారికి ప్రత్యేక అలంకారాలు చేసి పూజలు చేస్తున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. చివరి రోజు అమ్మవారికి అలంకరించిన చీరలను వేలం వేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.