Ponguleti Meets Bhatti : 'ఖమ్మం సభ ద్వారా కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుందని చాటిచెబుతాం' - కాంగ్రెస్‌లో చేరికపై మాట్లాడిన పొంగులేటి
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/22-06-2023/640-480-18817180-984-18817180-1687419650289.jpg)
Bhatti Vikramarka About Ponguleti Joining in Congress : రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుందన్న విషయాన్ని ఖమ్మంలో జరిగే బహిరంగసభ ద్వారా చాటిచెబుతామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. పొంగులేటి చేరిక, ఖమ్మంలో సభకు సంబంధించిన వివరాలను అధిష్ఠానంతో చర్చించి తర్వలోనే వెల్లడిస్తామన్నారు. హస్తం గూటికి చేరేందుకు పొంగులేటి సిద్ధమైన తరుణంలో..... రాష్ట్ర కాంగ్రెస్ నేతలు నిన్న ఆయన నివాసానికి వెళ్లి ఆహ్వానించారు. పాదయాత్రలో అస్వస్థతకు గురైన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నిన్న పార్టీ నేతలతో కలిసి పొంగులేటి ఇంటికి వెళ్లలేకపోయారు. ఈ నేపథ్యంలోనే నల్గొండ జిల్లా కేతెపల్లి వద్ద వడదెబ్బ తగిలి, అస్వస్థతకు గురయ్యారు. దీంతో తాత్కాలికంగా పాదయాత్రకు విరామం ఇచ్చారు. విశ్రాంతి తీసుకుంటున్న సీఎల్పీ నేతను పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తన అనుచరులతో కలిశారు. భట్టి విక్రమార్క ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న ఆయన... త్వరగా కోలుకుని, పాదయాత్ర విజయవంతంగా పూర్తిచేయాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, కాంగ్రెస్‌లో చేరే అంశం, తదుపరి రాజకీయ సమీకరణలపై ఇద్దరు ఏకాంతంగా చర్చించారు. ఖమ్మంలో భట్టి పాదయాత్ర, ముగింపు సభ, నేతల చేరిక గురించి వీరు చర్చించినట్లు తెలుస్తోంది. కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు భట్టి తెలిపారు.