Bhatti Challenges TS Government : కర్ణాటకలో అభివద్ధిపై బీఆర్‌ఎస్‌ మంత్రులకు సవాల్‌ విసిరిన భట్టి విక్రమార్క - తెలంగాణ వార్తలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Sep 27, 2023, 4:56 PM IST

Bhatti Challenges TS Government : గాంధీభవన్ ప్రాంగణంలోని ఇందిరా భవన్‌లో అభయహస్తం తెలంగాణ కాంగ్రెస్ వార్ రూమ్‌ను ఏఐసీసీ జనరల్ సెక్రటరీ పార్టీ రాష్ట్ర ఇంచార్జీ మాణిక్‌రావు ఠాక్రేతో కలిసి ప్రారంభించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ రాహుల్‌ గాంధీపై చేసిన వ్యాఖ్యలు బీజేపీకు ఉపయోగపడేలా ఉన్నాయని భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు  కేటీఆర్, హరీష్‌రావు, ఎమ్మెల్సీ కవితలు తమతోపాటు కర్ణాటకకు వస్తే అక్కడ కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీల అమలును చూపిస్తామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సవాల్‌ విసిరారు. ఈ నలుగురికి వోల్వో బస్సు కానీ ఫ్లైట్‌ టికెట్ బుక్ చేస్తామని తెలిపారు.

Bhatti Challenges to BRS Leaders : బీఆర్‌ఎస్‌ పాలకులు ఇంటికో ఉద్యోగం, దళిత ముఖ్యమంత్రి, కేజీ టు పీజీ, లక్ష ఎకరాలకు సాగునీరు, మూడెకరాల భూమి ఇస్తానని ప్రజలను నమ్మించి.. ఇవ్వకుండా మోసం చేశారని సీఎల్పీ నేత భట్టి మండి పడ్డారు. మీ ప్రభుత్వంలాగా మోసం చేయడం కాంగ్రెస్ పార్టీకి తెలియదని బీఆర్‌ఎస్‌ నాయకులను ఎద్దేవాచేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 100రోజుల్లో సోనియా గాంధీ ప్రకటించిన ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.