Bhatti Padayatra Updates : "కృష్ణానదిలో తెలంగాణ వాటా ఎంతో తేల్చాలి" - తెలంగాణ కాంగ్రెస్ న్యూస్
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/640-480-18608839-1097-18608839-1685187701155.jpg)
Bhatti Padayatra in Mahbubnagar DIST : స్వరాష్ట్రం సాధించి పదేళ్లైనా కేంద్రంతో మాట్లాడి, కృష్ణా ట్రైబ్యునల్‌తో మన రాష్ట్ర వాటా ఎంతో బీఆర్ఎస్ ప్రభుత్వం తేల్చలేక పోయిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో భట్టి పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీపై పలు విమర్శలు చేశారు. రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యమైన కల్వకుర్తి, బీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ వంటి ప్రాజెక్టులన్నీ శ్రీశైలం పైనే ఆధారపడి ఉన్నాయన్నారు. వీటిన్నింటికీ సమృద్ధిగా నీరు రావాలంటే ముందుగా కృష్ణానదిలో తెలంగాణ వాటా ఎంతో తేలాలని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో ప్రజలకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించలేని బీఆర్ఎస్ ప్రభుత్వం.. తమ పార్టీ కార్యాలయాలు మాత్రం వేగంగా నిర్మించుకుంటోందని విమర్శించారు. ప్రతి జిల్లాలోను బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలు కట్టిస్తున్నారని ఆరోపించారు. దిల్లీలో కూడా తమ పార్టీ కార్యాలయాన్ని వేగంగా పూర్తి చేసిందన్న విషయాన్ని గుర్తు చేశారు. అనంతరం స్థానిక సమస్యల గురించి ప్రజలతో చర్చించారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే సాధ్యమైనంత వేగంగా వాటిని నెరవేరుస్తారని చెప్పారు.