చూపు తిప్పుకోనివ్వని ప్రకృతి అందాలు... చూసొద్దామా..! - Beautiful waterfalls video in adialbad district
🎬 Watch Now: Feature Video
ఆదిలాబాద్ జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు నిండుకుండలా మారాయి. చెరువుల్లో జలకళ ఉట్టిపడుతోంది. జిల్లాలోని జలపాతాలు నీటితో కలకలలాడుతున్నాయి. ఎత్తైన గుట్టల నుంచి జాలువారే నీటిధారాలు చూపు తిప్పుకోనివ్వడం లేదు. రాష్ట్రంలో చూడదగిన పర్యాటక కేంద్రంగా పేరుగాంచిన.... నెరడిగొండ మండలంలోని కుంటాల జలపాతం కనువిందు చేస్తోంది. చుట్టూ పచ్చని చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణం మధ్య కుంటాల జలపాతం దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి. బోథ్ మండలంలోని పొచ్చెర జలపాతం.... జలకళతో చూపు తిప్పుకోనివ్వడం లేదు. ఎగువ నుంచి ఎక్కువ మొత్తంలో వస్తున్న నీటితో పొచ్చెర జలపాతం వద్ద ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఇచోడ మండలం గుండివాగు సమీపంలో ఉన్న గాయత్రి జలపాతం పర్యాటకులను విశేషంగా అలరిస్తోంది. సుమారు 200 అడుగుల ఎత్తు నుంచి నీరు కిందకు దూకుతుంటే... ఆ దృశ్యాన్ని చూసి తీరాల్సిందే. ఎత్తైన గుట్టల నుంచి ప్రవహించే నీటిధారాలు కనువిందు చేస్తున్నాయి.
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST