bhatti fires on CM KCR : 'భూములు లాక్కోవద్దన్నందుకు రైతులకు బేడీలా..?' - Nalgonda latest news
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/640-480-18757898-644-18757898-1686803401228.jpg)
Bhatti Vikramarka Comments On CM KCR : ఉమ్మడి నల్గొండ జిల్లాకు సాగునీరందించేందుకు SLBC ని కాంగ్రెస్ ప్రారంభిస్తే కేసీఆర్ వచ్చాక 3 కిలోమీటర్లైనా సొరంగం తవ్వలేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. మంత్రి జగదీశ్‌రెడ్డి, గుత్తా సుఖేందర్‌రెడ్డితో నల్గొండ జిల్లాకు ఎలాంటి ఉపయోగంలేదని అన్నారు. పీపుల్స్ మార్చ్‌లో భాగంగా ఆయన చేపట్టిన పాదయాత్ర నల్గొండ జిల్లాలో కొనసాగుతోంది. నాగార్జునసాగర్ నుంచి నల్గొండ నియోజకవర్గంలోకి భట్టి పాదయాత్ర చేరుకుంది. కనగల్ మండలం లచ్చుగూడెం వద్ద కాంగ్రెస్ శ్రేణులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఆదిలాబాద్ నుంచి వెయ్యి కిలోమీటర్లు పాదయాత్ర చేశానని... ఎవరిని కదిలించినా కష్టాలే ఉన్నాయని భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్రంలో నేడు భయంకరమైన పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. భూములు లాక్కోవద్దని ఆందోళన చేసిన రైతులకు బేడీలు వేసే పరిస్థితి రాష్ట్రంలో నెలకొందన్న భట్టి ఆర్నెళ్లలో ఇందిరమ్మ రాజ్యం రాష్ట్రంలో రానుందని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక పేదలు ఇల్లు కట్టుకోవడానికి రూ.5 లక్షలు, ప్రతి పేద కుటుంబానికి రూ.500 లకే గ్యాస్, 2లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు.