Balagam Director Venu Visits Tirumala: బలగం సినిమాకు ఎన్ని అవార్డులంటే..? - శ్రీవారిని దర్శించుకున్న బలగం మూవీ డైరెక్టర్ వేణు
🎬 Watch Now: Feature Video
బలగం సినిమా గురించి రెండు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరు. తెలంగాణ పల్లె వాతావరణాన్ని, కుటుంబాల్లో కనిపించే ప్రేమానురాగాలను కళ్లకు కట్టినట్లు తెరపై అద్భుతంగా చూపించాడు డైరెక్టర్ వేణు. ఏ సినిమాకు దక్కని గుర్తింపు బలగం సినిమాకు దక్కింది. పల్లె ప్రజలు బలగం సినిమాని సామూహికంగా చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒక చిత్రాన్ని చూసి విడపోయిన కుటుంబాలు కలుస్తున్నాయంటే అర్థం చేసుకోవచ్చు ఈ సినిమాకు ఉన్న క్రేజ్ గురించి.
డైరెక్టర్ వేణు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయన కుమారుడు, మరో నటుడు రచ్చ రవి కూడా స్వామి వారిని దర్శించుకున్నారు. బుధవారం ఉదయం ఆయన స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో వేణు మాట్లాడుతూ.. తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పారు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 31 అవార్డులు బలగం చిత్రానికి వచ్చాయని తెలిపారు. ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. తన రెండో సినిమా కూడా దిల్‌రాజు నిర్మాణంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌లో చేస్తున్నామని డైరెక్టర్ వేణు తెలిపారు.