Balanagar Flyover Suicide Video : మద్యం మత్తులో ఫ్లైఓవర్ పైనుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య - Hyderabad flyover suicide news
🎬 Watch Now: Feature Video
Hyderabad Flyover Suicide Video : మద్యం మత్తులో ఫ్లైఓవర్ పైనుంచి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్‌లోని బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వెల్డింగ్ షాపులో కార్మికుడిగా పని చేస్తున్న భూక్యా అశోక్.. రేష్మా బేగం అనే ఓ మహిళను ప్రేమ వివాహం చేసుకొని, కోమటి బస్తీలో నివసిస్తున్నాడు. ప్రతి రోజు మద్యం సేవించి భార్యను కొడుతూ హింసించేవాడు. మద్యం మత్తులో తాను చనిపోతానంటూ బెదిరిస్తుండేవాడు. గతంలో రెండుసార్లు భార్యతో గొడవ పడి బ్లేడుతో కోసుకొని బలవన్మరణానికి యత్నించాడు. సోమవారం కూడా మద్యం సేవించి భార్యను కొట్టి, ఆత్మహత్య చేసుకుంటానని ఇంటి నుంచి వెళ్లిపోయాడు. మధ్యాహ్నం వేళ హైదరాబాద్‌లోని బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫ్లైఓవర్ నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆత్మహత్యకు పాల్పడ్డ వీడియో దగ్గరలో ఉన్న సీసీ కెమెరాలో రికార్డయింది. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.