అయోధ్య రాముడిపై అభిమానం - సంక్రాంతి ముగ్గులతో ఆవిష్కృతం - sankranti festival
🎬 Watch Now: Feature Video
Published : Jan 15, 2024, 5:01 PM IST
Ayodhya Rama Mandir Rangoli : దేశవ్యాప్తంగా ఎవరిని కదిలించినా, ఎవరి నోట విన్నా ఈనెల 22న జరిగే అయోధ్య రామమందిరం ప్రాణప్రతిష్ట గురించే వినిపిస్తోంది. ఎవరికి వారు ఆ రాముడిని తలుచుకుంటూ తమ తమ పద్దతిలో భక్తిని చాటుకుంటున్నారు. ఈనేపథ్యంలో మన రాష్ట్రంలో కొందరు మహిళలు సంక్రాంతి వేళ రామమందిర నమూనా ముగ్గులను వేసి అబ్బురపరిచారు. రామాలయ నమునాలో త్రీడీ ముగ్గులు వేసి మరింత అందంగా తీర్చిదిద్దారు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన శ్రావణి అనే మహిళ మూడున్నర గంటల పాటు శ్రమించి ఇంటి ముంగిట త్రీడీ రూపంలో అయోధ్య రామాలయ నమూనా ముగ్గును వేసి ప్రత్యేకతను చాటారు. ఈ నెల 22న అయోధ్యలో రామ మందిరాన్ని ప్రారంభిస్తున్న నేపథ్యంలో ఇంటి ముందు రామమందిర ముగ్గు వేసినట్లు తెలిపారు. కాలనీవాసులు ఆసక్తిగా తిలకించారు.
Sankranti Celebrations : మరోవైపు సంగారెడ్డి పట్టణంలోనూ కొందరు మహిళలు అయోధ్య రామమందిర నమునా ముగ్గులను వేశారు. ఈ నెల 22న అయోధ్య శ్రీరాముడి ఆలయ ప్రారంభాన్ని స్వాగతిస్తూ ఈ ముగ్గు వేసినట్లు తెలిపారు.