ఎన్‌ఆర్‌ఐపై దాడి చేసి విదేశీ కరెన్సీని దోచుకున్న ఆటో డ్రైవర్‌ గ్యాంగ్ - స్నేహితులతో కలిసి దాడికి దిగిన ఆటోడ్రైవర్‌

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Dec 10, 2023, 11:31 AM IST

Auto Drivers Attacked NRI In Hyderabad : హైదరాబాద్ మధురానగర్‌లో ఆటో డ్రైవర్‌లు ఎన్‌ఆర్‌ఐ పై దాడి చేసి అతని వద్ద ఉన్న విదేశి కరెన్సీని దోచుకున్నారు. ప్రవాస భారతీయుడు సాబిడి సిల్వా మూడు వారాల క్రితం బెల్జియం నుంచి ఇండియాకు వచ్చారు. తనకు ఇష్టమైన సీఎం రేవంత్ రెడ్డిని కలవాలని గోవా నుంచి సికింద్రాబాద్ చేరుకున్నారు. సీఎంను కలిసే అవకాశం దొరకక పోవడంతో శుక్రవారం రాత్రి తిరుగు ప్రయాణమయ్యారు. 

జూబ్లీహిల్స్ నుంచి సికింద్రాబాద్​కు వెళ్లేందుకు ఆటో ఎక్కారు. తన వద్ద ఇండియన్ కరెన్సీ లేదని యూరో కరెన్సీ మార్పిడి చేయాల్సి ఉందని ఆటో డ్రైవర్​కు చెప్పారు. అందుకు డ్రైవర్ సాయం కోరారు. ఆటో డ్రైవర్ తన స్నేహితులను రాత్రి 11 గంటల సమయంలో నిర్మానుష్య ప్రాంతమైన యూసుఫ్ గూడ జానకమ్మ తోట వద్దకు పిలిపించాడు. అక్కడ ఆటో డ్రైవర్ తన మిత్రులతో కలిసి సాబిడి సిల్వాపై దాడి చేసి అతని వద్ద ఉన్న 1200 యూరో కరెన్సీ, ల్యాప్​టాప్, మొబైల్ ఫోన్​ను లాక్కున్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.