Attack On Police in Suryapet District : తనిఖీ తప్పించుకునేందుకు యువకుడి యత్నం.. ప్రమాదంలో మృతి.. పోలీసులపై బంధువుల దాడి - attack on canistable in suryapet

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Aug 30, 2023, 1:04 PM IST

Updated : Aug 30, 2023, 1:21 PM IST

Attack On Police in Suryapet District : పోలీసులు వాహనాలను తనిఖీ చేయడం సహజం. వారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఒకరు ఏకంగా ప్రాణాలనే పోగొట్టుకున్నారు. ఇలాంటి  ఘటన సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... సూర్యాపేట జిల్లా నాగారం మండలం ఫణిగిరి వద్ద మంగళవారం సాయంత్రం పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహించారు.  హైదరాబాద్​ నుంచి ఈతూరు గ్రామం వైపు వెళుతున్న హరీశ్ (20) పోలీసుల నుంచి తప్పించుకునేందుకు యూటర్న్​ తీసుకునే ప్రయత్నం చేశాడు. ఆ క్రమంలో ప్రమాదం జరగడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. పండగ కోసం ఇంటికి వస్తున్న హరీశ్​ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని తెలుసుకున్న వారి కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. యువకుడి మరణానికే పోలీసులే కారణమంటూ గ్రామస్థులు తుంగతుర్తి రహదారిపై ఆందోళనకు దిగారు. గ్రామస్థులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న క్రమంలో హెడ్​కానిస్టేబుల్​ రవీందర్​ రెడ్డిపై మృతుని బంధువులు చెప్పులతో దాడి చేశారు. అదనపు సిబ్బంది వచ్చిన తరువాత మృతదేహాన్ని పోస్ట్​మార్టమ్ కోసం తరలించారు. 

Last Updated : Aug 30, 2023, 1:21 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.