ఓవైసీ తమ్ముడా - ఓసారి యూపీ, హర్యానాలకు వచ్చి చూసిపో : హేమంత బిశ్వశర్మ - తెలంగాణ ఎన్నికల ఫైట్ 2023
🎬 Watch Now: Feature Video
Published : Nov 24, 2023, 10:18 PM IST
Assam CM Hemanta BiswaSarma Election Campaign : రాష్ట్రంలో బీజేపీ సర్కార్ ఏర్పాటుతో బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తామని అసోం రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వశర్మ అన్నారు. రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ చేస్తామని పేర్కొన్నారు. కరీంనగర్, వికారాబాద్ జిల్లాల్లో నిర్వహించిన బీజేపీ రోడ్‌షోలలో ఆయన పాల్గొని ప్రసంగించారు. నిరుపేదలకు ప్రతి ఏటా ఉచితంగా నాలుగు సిలిండర్ల వంట గ్యాస్ పంపిణీ చేస్తామని హేమంత్ బిశ్వశర్మ హామీ ఇచ్చారు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని.. రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు అంతర్గతంగా కలిసి పని చేస్తున్నాయని విమర్శలు చేశారు.
ఒవైసీ తమ్ముడా ఓసారి యూపీ, హర్యానా రాష్ట్రాలకు వచ్చి చూడు.. ఐదు నిమిషాల్లో నీ ఇసాబ్ పూర్తి చేస్తామని అసోం సీఎం ఘాటైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు ఒకటేనని ఆరోపించారు. తెలంగాణలో బీజేపీ సర్కార్ రాబోతోందని.. బీసీ వ్యక్తే సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ దళితుడికి ముఖ్యమంత్రి పదవి ఇస్తానని మోసం చేశారని మండిపడ్డారు. అందుకే బీజేపీ అందరికీ న్యాయం చేసే పరిపాలన చేస్తోందని హేమంత్ బిశ్వ శర్మ తెలిపారు.
Telangana Election Polls 2023 : హైదరాబాద్‌లో ఏ పార్టీ వచ్చినా.. ఒవైసీకి జిందాబాద్ కొడుతున్నారని అసోం సీఎం హేమంత్ బిశ్వశర్మ అన్నారు. కాంగ్రెస్ వస్తే ముస్లింలకు రిజర్వేషన్ కల్పిస్తామని మాట ఇచ్చారని.. అదే బీఆర్ఎస్ వస్తే ముస్లింల కోసం ఐటీ పార్కు నిర్మిస్తామని అంటున్నారని గుర్తు చేశారు. రెండు రోజుల క్రితం అసదుద్దీన్ పోలీసులను బెదిరించాలని గుర్తు చేశారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలతో తమకు ఎలాంటి సంబంధాలు లేవని స్పష్టం చేశారు.