కాంగ్రెస్ పార్టీ ఆర్‌ఎస్‌ఎస్‌కి మాతృ సంస్థ : అసదుద్దీన్ - రాహుల్ చేసిన ఆరోపణలను తిప్పికొట్టిన ఓవైసీ
🎬 Watch Now: Feature Video
Published : Nov 3, 2023, 3:31 PM IST
Asaduddin Owaisi Comment 0n Congress : కాంగ్రెస్ పార్టీకి ఆర్‌ఎస్‌ఎస్ మాతృ సంస్థ అని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. సంగారెడ్డిలో పార్టీ కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఓవైసీ మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్, బీజేపీ రెండు వేర్వేరు పార్టీలు కాదని రెండు ఓకే జాతికి చెందిన పార్టీలుగా ఆయన అభివర్ణించారు. తమ పార్టీకి బీజేపీ డబ్బులు ఇస్తోందని రాహుల్ చేసిన ఆరోపణలను అసదుద్దీన్ తిప్పికొట్టారు. రాహుల్‌గాంధీకి సత్తా ఉంటే హైదరాబాద్‌లో తమపై పోటీకి రావాలని సవాల్ విసిరారు.
ఈ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో త్రిముఖ పోటీ ఉంటుందని, ఈ మిగిలిన పవర్ తమ పార్టీ చేతిలో ఉంటుందన్నారు. రాహుల్ మాపై పోటీ చేయడానికి సిద్ధమయితే ఎంఐఎం సత్తా ఏంటో చూపిస్తామన్నారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడుగా ఎన్నికై ఆ పార్టీని నాశనం చేస్తున్నాడని అసదుద్దీన్ ఆరోపించారు. రేవంత్‌రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరి సైకిల్ పార్టీని తెలంగాణలో భూస్థాపితం చేశారని విమర్శించారు. దుబ్బాక ఎంపీ కొత్తప్రభాకర్ రెడ్డిపై దాడిని తాము ఖండిస్తున్నమని అన్నారు. తమ పార్టీ మద్దతు కేసీఆర్‌కే ఉంటుందని ఓవైసీ తెలిపారు. ఎంఐఎం కార్యకర్తలందరూ బీఆర్ఎస్కు అండగా నిలవాలని అసదుద్దీన్ సూచించారు.