ఎమ్మెల్యేలకు చెప్పకుండా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుని ప్రెస్​మీట్ - చివరకు ఏమైందంటే - కాంగ్రెస్‌ వాగ్వాదం

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Jan 11, 2024, 5:07 PM IST

Argument Between Congress Activists In Mahabubabad : కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకున్న ఘటన మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భరత్ చందర్ రెడ్డి వర్గీయులు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ మీడియా సమావేశానికి ఎమ్మెల్యే కోరం కనకయ్యకు చెందిన ఒక వర్గానికి పిలుపు లేదు. దీంతో మాకు చెప్పకుండా మీడియా సమావేశాన్ని ఎలా ఏర్పాటు చేశారంటూ ఎమ్మెల్యేకు చెందిన ఆ వర్గీయులు ధర్నాకు దిగారు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. 

Congress Activists Argument Issue : విషయం తెలుసుకున్న పోలీసులు పార్టీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ఇరు వర్గాలకు సర్ది చెప్పడంతో గొడవ అదుపులోకి వచ్చింది. ఆ తర్వాత కాంగ్రెస్ కార్యకర్తలందరిని పోలీసులు బయటకు పంపించి కార్యాలయానికి తాళం వేశారు. ఆందోళన పుణ్యమా మీడియా సమావేశం కూడా జరగలేదు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.