యాంటీ క్యాన్సర్ డ్రగ్స్‌పై డీసీఏ ఉక్కుపాదం - భారీ మొత్తంలో నకిలీ మందులు స్వాధీనం
🎬 Watch Now: Feature Video
Published : Dec 6, 2023, 12:59 PM IST
Telangana DCA Seized Anti Cancer Drugs : రాష్ట్రంలో భారీ మొత్తంలో అక్రమంగా తయారు చేస్తున్న యాంటీ క్యాన్సర్ డ్రగ్స్‌ని పట్టుకునట్టు తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ప్రకటించింది. వాటి విలువ దాదాపు రూ.4 కోట్ల 35 లక్షల వరకు ఉంటుందని స్పష్టం చేసింది. ఇప్పటి వరకు ఇంత పెద్ద మొత్తంలో యాంటీ క్యాన్సర్ మందులను సీజ్ చేయడం ఇదే తొలిసారని పేర్కొంది. అస్ట్రికా హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో అక్రమంగా యాంటీ కాన్సర్ మందులు తయారు చేస్తున్నట్లు సమాచారం అందుకున్న డ్రగ్ కంట్రోల్ అధికారులు, ఈ నెల 2వ తేదీన నగర వ్యాప్తంగా పలు చోట్ల సోదాలు నిర్వహించారు. డ్రగ్ కంట్రోల్ విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ రాము ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందం అస్ట్రికా హెల్త్ కేర్ వినియోగిస్తున్న కొరియర్ సర్వీస్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించారు.
Anti Cancer Drugs Seized in Hyderabad : మచ్చ బొల్లారంలోని ఓ గోదామ్‌లో అక్రమంగా మందులను ఉంచిన విషయం గుర్తించి రైడ్ చేసినట్టు ప్రకటించారు. మొత్తం 36 రకాల యాంటీ క్యాన్సర్ మందులను స్వాధీనం చేసుకోవడంతో పాటు, ఆస్ట్రికా హెల్త్ కేర్ డైరెక్టర్ సతీశ్ రెడ్డిపై కేస్ నమోదు చేసినట్టు పేర్కొన్నారు. ఆస్ట్రికా హెల్త్ కేర్ లైసెన్స్ 2021 జులైలోనే ముగిసినప్పటికీ ఇంకా అక్రమంగా మందులను తయారు చేస్తున్నట్టు చెప్పారు. తెలంగాణకు చెందిన ఆస్ట్రా జెనరిక్ ప్రైవేట్ లిమిటెడ్, ఆస్ట్రికా హెల్త్ కేర్, బ్లెస్ ఫార్మా, హిమాచల్ ప్రదేశ్‌కి చెందిన మిడాన్ బయో టెక్, అలయన్స్ బయోటెక్, సన్ వెట్ హెల్త్ కేర్, సాలస్ ఫార్మా స్యూటికల్స్, డీఎం ఫార్మా, ఏపీకి చెందిన సేఫ్ పేరెంటరల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థల పేర్లతో కూడిన మందులను సీజ్ చేసినట్టు అధికారులు వెల్లడించారు.
TAGGED:
Telangana Crime news