Annadanam On the Ocassion of Ganesh Immersion : 15 ఏళ్లుగా ట్యాంక్‌బండ్ వద్ద పాతబస్తీ వ్యాపారి అన్నదానం - ట్యాంక్‌బండ్‌పై అన్నదానం
🎬 Watch Now: Feature Video


Published : Sep 28, 2023, 5:03 PM IST
Annadanam At Tankbund On the Ocassion of Ganesh Immersion : హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం చూడడానికి వివిధ జిల్లాల నుంచి వస్తారు. వర్షం పడినా పబ్లిక్ ఎంతా ఉన్నా సరే గణపయ్యను గంగ ఒడికి చేర్చే వరకు ఇక్కడే ఉండి కళ్లారా వీక్షించే ఇళ్లకు వెళ్తారు. హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం అంటే అంత ఫేమస్ దానికి కారణం ఇక్కడ వేలల్లో ఏర్పాటు చేసే వివిధ రూపాల వినాయకులు. నిమజ్జనం రోజూ ఎంతో ఆడంబరంగా నిమజ్జనానికి ఏర్పాట్లు చేస్తారు. అందుకే ఇదంతా చూడడానికి పక్క రాష్ట్రాల నుంచి కూడా హైదరాబాద్‌కు వస్తారు.
కానీ వారు ఏం తింటారు ఎక్కడు ఉంటారు అని ఎవరైనా ఆలోచించేవారుంటారా.. అంటే అవుననే చెప్పాలి. గత 15 ఏళ్లుగా భాగ్యనగరంలో జరుగుతున్న గణేష్ నిమజ్జనం కోసం వస్తున్న భక్తులకు... మానవతా మూర్తులు ఆపన్నహస్తం అందిస్తున్నారు పాతబస్తీకి చెందిన వ్యాపారి శ్రీధర్. గణేశ్ నిమజ్జనం కోసం పెద్ద ఎత్తున వస్తున్న భక్తులకు అన్నదానం చేస్తున్నారు. దాదాపు 50 వేలకు మందికి గత 15 ఏళ్లుగా ఈ అన్నదానం చేస్తున్నట్లు శ్రీధర్ తెలిపారు.