119 Feet Image: చిన్నారులకి ప్రేమతో వైద్యం.. చెబుతోంది ఈ చిత్రం - నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి
🎬 Watch Now: Feature Video
An Impressive 119 Feet Tall Image On Wall: నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి గోడపై వేసిన చిత్రం చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. చిన్నపిల్లలకి ప్రేమతో వైద్యమని కనిపించే విధంగా ఆ చిత్రం ఉంది. చిన్నపిల్లలు ఆసుపత్రి అనగానే ఆందోళన చెందుతారు కదా.. అలా కాకుండా ఆనందంగా వైద్యం చేయించుకోవచ్చు అన్నట్టుగా ఆ చిత్రం కనిపిస్తుంది. వైద్యులు వినూత్నంగా ఆలోచించి.. ప్రేమతో స్నేహపూర్వకమైన వైద్యాన్ని చిన్నారులకు అందిస్తారనే సందేశాత్మక చిత్రాన్ని నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి గోడపై వేయించారు. చిన్నారులు డాక్టర్ అంటే భయపడుతుంటారు. ఆ భయం పోవడనికే వైద్యులు ఈ చిత్రాన్ని ఇలా గోడపై వేయించి, వారిలోని భయాన్ని పోగొట్టేలా చేస్తున్నారు. దీంతో వారికి వైద్యం కూడా సులభంగా అవుతుందని, చిన్నారులు కూడా తమకు సహకరిస్తారని వైద్యులు భావిస్తున్నారు. ఈ చిత్రం 119 అడుగుల ఎత్తైన బొమ్మ కావడంతో విశేషంగా చూపరులను ఆకట్టుకుంటుంది. చిన్నపిల్లలు వ్యాక్సినేషన్ సమయానికి అందించడానికి గుర్తుగా ఇది ఉందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.