దేవుడి కోసం ఎయిర్‌పోర్ట్‌లో విమానాలన్నీ 5 గంటలు బంద్
🎬 Watch Now: Feature Video
కేరళ తిరువనంతపురంలోని శ్రీ అనంత పద్మనాభ స్వామి, నరసింహ స్వామి ఉత్సవ మూర్తులను అంగరంగ వైభవంగా ఊరేగించారు. తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి షన్ముగం బీచ్ వరకు విగ్రహాలను ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఎయిర్పోర్ట్ రన్‌వేపై నుంచి ఉత్సవం సాగిన నేపథ్యంలో ఈ కార్యక్రమం జరిగిన ఐదు గంటల సేపు విమానాశ్రయంలో రాకపోకలు నిలిచిపోయాయి. ప్రధాన ఎయిర్లైన్లకు చెందిన సుమారు 10 విమానాలు రీషెడ్యూల్ అయ్యాయి. అల్పశి ఆరట్టు పేరుతో ఏడాదికి రెండుసార్లు ఈ ఊరేగింపు నిర్వహిస్తారు. వందల సంవత్సరాల నుంచి ఇదే మార్గంలో ఊరేగింపు కొనసాగుతోంది. ఊరేగింపు జరిగే మార్గంలోనే 1932లో తిరువనంతపురం విమానాశ్రయం ఏర్పాటైంది. అప్పటి నుంచి ఈ కార్యక్రమం జరిగేటప్పుడు.. విమానాల రాకపోకలను నిలిపివేస్తున్నారు.
Last Updated : Feb 3, 2023, 8:31 PM IST