అలంపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి విజయుడి నామినేషన్‌పై వివాదం
🎬 Watch Now: Feature Video
Alampur BRS candidate Vijayudu Nomination Controversy : అలంపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి విజయుడి నామినేషన్‌పై వివాదం నెలకొంది. ఈసీ నిబంధనలకు అనుగుణంగా.. నామినేషన్ దాఖలు చేయలేదని ప్రతిపక్ష అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. తక్షణమే నామినేషన్‌ను రద్దు చేయాలని రిటర్నింగ్ అధికారికి విజ్ఞప్తి చేశారు.
Alampur BRS candidate Nomination Issue : విజయుడు ఉపాధి హామీ పథకంలో క్షేత్ర సహాయకుడిగా(ఫీల్డ్ అసిస్టెంట్) ఉద్యోగం చేశారని.. అందుకు సంబంధించిన రాజీనామా లెటర్‌ను నామ పత్రాలలో పొందుపరచలేదని పేర్కొన్నారు. అనంతరం అలంపూర్ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి.. చంద్రకళ కారును అడ్డుకుని ప్రశ్నించారు. రిటర్నింగ్ అధికారి.. అధికార బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. నామ పత్రాలపై విజయుడు చేసిన అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ లేఖను అందజేశారు. ఆర్వో కార్యాలయం వద్ద కోలాహలం నెలకొనడంతో శాంతిభద్రతల దృష్ట్యా.. డీఎస్పీ వెంకటేశ్వర్లు అక్కడికి చేరుకొని అభ్యర్థులతో చర్చించారు. ఈ విషయంపై కేంద్ర ఎన్నికల అధికారికి నివేదించుతామని.. కలెక్టర్‌తో కూడా చర్చించనున్నట్లు ఎన్నికల పరిశీలకులు పేర్కొన్నారు.