Adilabad Road Accident : ఒల్లు జలదరించే ప్రమాదం.. జస్ట్‌లో మిస్.. వీడియో వైరల్
🎬 Watch Now: Feature Video
Adilabad Road Accident : అతివేగం ఎల్లప్పుడూ ప్రమాదకరమే.. జాతీయ రహదారులపై ప్రయాణించేటప్పుడు వాహనచోదకులు కనీస నియమాలు పాటించాల్సిందే. లేని పక్షంలో ప్రమాదాలకు దారి తీయొచ్చు. ఆదిలాబాద్ జిల్లాలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వచ్చిన వాహనాన్ని తప్పించబోయి.. లారీ అదుపు తప్పి బోల్తా పడింది. ద్విచక్ర వాహనదారుడు యూటర్న్ తీసుకోవడానికి ఇండికేటర్ లైట్ వేయకుండా మలుపు తీసుకున్నాడు. వెనుకనుంచి వేగంగా వస్తున్న ట్రక్కు అతనిని తప్పించబోయి ప్రమాదం జరిగింది. ఈ ఘటన మావల - గుడిహత్నూర్ మండలాల మధ్య 44వ నంబర్ జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. రాజస్థాన్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న లారీ.. వాఘపూర్ క్రాస్ రోడ్డు సమీపంలో ముందుగా వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి డివైడర్ని డీకోట్టి బోల్తాడింది. లారీలోని డ్రైవర్స్ సహా.. ద్విచక్ర వాహనదారుడుకి తీవ్ర గాయాలు కావడంతో వారిని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. బోల్తాపడిన లారీని క్రేన్ సాయంతో తొలగించారు. దీంతో కాసేపు రవాణాకు అంతరాయం ఏర్పడింది. మరలా ట్రాఫిక్‌ను పునరుద్దరించారు.