నగరంలో సినీ నటి రాశీఖన్నా సందడి.. - KPHB Latest News
🎬 Watch Now: Feature Video
Actress Raashi Khanna in Hyderabad : హైదరాబాద్ కూకట్‌పల్లిలో సినీ నటి రాశీఖన్నా సందడి చేశారు. కేపీహెచ్‌బీ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ బంగారు నగల దుకాణాన్ని ఆమె ప్రారంభించారు. స్టోర్‌లో కలియ తిరుగుతూ పలు ఆభరణాలను ధరించి ఫొటోలకు పోజులిచ్చారు. రాశీఖన్నాను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. రాశీ ఖన్నా రాకతో యువత కేరింతలు, ఈలలతో ఆ ప్రాంతమంతా హోరెత్తింది. కాసేపు స్టేజీపై నుంచి ప్రజలకు అభివాదం చేశారు రాశీఖన్నా.
ఈ సందర్భంగా తనకు నగలు అంటే చాలా ఇష్టమని రాశీ ఖన్నా తెలిపారు. ఈ స్టోర్‌లో మగువలను కట్టిపడేసే అద్భుతమైన బంగారు ఆభరణాల కలెక్షన్లు ఉన్నాయని చెప్పారు. తెలంగాణలో నేడు మూడో స్టోర్‌ను ప్రారంభించుకోవటం సంతోషంగా ఉందని.. సంస్థ ఛైర్మన్ బిందు మాధవ్ అన్నారు. త్వరలో ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో కూడా ప్రారంభించనున్నట్లు చెప్పారు. అద్భుతమైన డిజైన్లు తమ వద్ద ఉన్నాయని పేర్కొన్నారు. వినియోగదారులు తమ దుకాణాన్ని సందర్శించి ఆదరించాలని బిందు మాధవ్ కోరారు.