హైదరాబాద్‌లో గంజాయి చాక్లెట్లు, ఒకరిని అరెస్ట్ చేసిన ఎల్‌బీనగర్ ఎస్వోటీ - హైదరాబాద్ గంజాయి కేసు
🎬 Watch Now: Feature Video
Published : Nov 9, 2023, 5:20 PM IST
A person selling ganja chocolates was arrested on the outskirts of Hyderabad : హైదరాబాద్ నగర శివార్లలో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న ఒకరిని ఎల్‌బీనగర్ ఎస్వోటీ పోలీసులు అరెస్టు చేసి ఠాణాకు తరలించారు. నిందితుడు బిహార్‌లోని దర్బాంగాకు చెందిన దీపక్ కుమార్ శర్మగా పోలీసులు గుర్తించారు. ఆ వ్యక్తి ప్రస్తుతం ఎల్‌బీనగర్‌లో నివసిస్తున్నాడు. ప్రారంభంలో నిందితుడే స్వయంగా గంజాయి చాక్లెట్లు తినేవాడు. క్రమంగా అతనే విక్రేతగా అవతారమెత్తాడు.
Ganja Choclates Seized In Hydrabad : గంజాయి చాక్లెట్లు అవసరమైన వారికి విక్రయిస్తున్నట్లుగా సమాచారం అందుకున్న ఎస్వోటీ పోలీసులు గాలించి దీపక్‌ను పట్టుకున్నారు. నిందితుని దగ్గర 70 గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఒక్కో చాక్లెట్ సుమారు 5 గ్రాములు ఉందని పోలీసులు తెలిపారు. అసలు ఈ చాక్లెట్లు అతనికి ఎవరు సరఫరా చేస్తున్నారు... ఎక్కడ నుంచి వీటిని తీసుకువస్తున్నారు అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఎన్నికల వేళ పోలీసులు తనిఖీ చేస్తుండగా గంజాయి, మత్తు పదార్థాలు భారీ మెుత్తంలో పట్టు పడుతున్నాయి.