Onions for Rs.1 in Karimanagr : 'రండి బాబు.. రండి.. కిలో ఉల్లిగడ్డ రూపాయికే' - telangana latest news

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 17, 2023, 1:01 PM IST

Updated : May 17, 2023, 1:25 PM IST

Onions for Rs.1 in Karimanagr : ఏదైనా ఉచితంగా దొరికిందంటే ఎవరైనా సరే ఎగబడుతుంటారు. ఇంట్లో ఎంత ఉన్నా సరే ఇంకొంచెం కావాలనే ఆశ పడుతుంటారు. ఎగబడి ఎత్తుకుపోతుంటారు. అలాంటి సంఘటనే కరీంనగర్ జిల్లాలో జరిగింది. శంకరపట్నం మండలం కొత్తగట్టు వద్ద ఉల్లిగడ్డల లోడ్​తో వచ్చిన వారు.. రూపాయికి కిలో చొప్పున విక్రయిస్తామని ప్రకటించారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు ఉల్లిగడ్డల వ్యాన్ దగ్గరకి బారులు తీశారు. ఊహించని రీతిలో తక్కువ ధరకు ఉల్లిగడ్డలు విక్రయించడంతో ప్రజలు వాహనాలు తెచ్చుకుని భారీ మొత్తంలో ఉల్లిగడ్డలను కొనుగోలు చేసి తీసుకెళ్లారు. మార్కెట్​ కన్నా తక్కువ ధరకు ఉల్లిగడ్డ వస్తుండటంతో గ్రామీణులు కొనడానికి ఎగబడ్డారు. 

అసలేం జరిగిందంటే.. నాగ్​పుర్​కు చెందిన వ్యక్తి వరంగల్ మార్కెట్​లో ఉల్లిని విక్రయిచండానికి తీసుకెళ్లాడు. మార్కెట్​లో ఉల్లికి కనీస ధర లేకపోవడంతో ఆ వ్యక్తి వ్యాన్​లో తిరుగు ప్రయాణమయ్యాడు. కొత్తగట్టు వద్ద వ్యాన్​ను నిలిపి కిలోకి రూపాయి చొప్పున 50కిలోల ఉల్లి బస్తాను రూ.50కు విక్రయించాడు. దీంతో తక్కువ ధర పలుకుతుండటంతో ప్రజలు పెద్దఎత్తున కొనుగోలు చేశారు. 

Last Updated : May 17, 2023, 1:25 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.