అమ్మో.. ఫార్మా కంపెనీలో మంటలు ఏ స్థాయిలో వచ్చాయో తెలుసా..! - medchal fire accident news
🎬 Watch Now: Feature Video
FIRE ACCIDENT: మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా జీడిమెట్ల పారిశ్రామిక వార్డులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. వశిష్ట లైఫ్ సైన్స్ ఫార్మా పరిశ్రమలో భారీ శబ్ధంతో ఒక్కసారిగా పేలుడు జరిగి.. దట్టంగా పొగలు అలుముకున్నాయి. ఈ క్రమంలోనే రియాక్టర్ పేలడంతో రోడ్డుపై అటుగా వెళ్తున్న ఇద్దరిపై రేకు ముక్కలు ఎగిరిపడ్డాయి. గాయాలపాలైన వారిద్దరిని ఆసుపత్రికి తరలించగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఘటనా స్థలానికి చేరుకుని 4 అగ్నిమాపక శకటాలతో మంటలను అదుపు చేశారు. ప్రమాదం సంభవించిన వెంటనే అందులో పని చేసే కార్మికులంతా బయటకు పరుగులు తీయడంతో పెను ప్రమాదం తప్పింది.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST