A Person Dragged Car Bonnet : కారుతో ఢీ కొట్టి.. బానెట్‌పై వేలాడుతున్నా ఆపకుండా.. - A policeman locked a man on a car in Shamshabad
🎬 Watch Now: Feature Video
A Man Dragged on Car Bonnet : ఓ యువకుడిని కారుతో ఢీకొట్టి 100మీటర్లు లాకెళ్లిన హెడ్ కానిస్టేబుల్ జ్ఞానేశ్వర్‌పై శంషాబాద్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఘటనకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. జ్ఞానేశ్వర్‌ను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ముచ్చింతల్‌కు చెందిన ధారకృష్ణ-బాలమణి దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. అదే గ్రామానికి చెందిన జ్ఞానేశ్వర్ పోలీస్‌శాఖలో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు.
ఈ క్రమంలోనే జ్ఞానేశ్వర్ ఇంటి ముందు నుంచి పొలం పనులకు వెళ్తున్న ధార కృష్ణ కుమారుడు పవన్ కుమార్‌తో.. హెడ్ కానిస్టేబుల్ కుమారుడు వంశీ అకారణంగా గొడవపడి చితకబాదాడు. దీంతో పవన్ స్పృహ కోల్పోయాడు. ఈ ఘటనపై మాట్లాడేందుకు వెళ్లిన బాధితుడి తల్లి, చెల్లిపై జ్ఞానేశ్వర్ చేయి చేసుకున్నాడు. అనంతరం బంధువు రాజు, పలువురు గ్రామస్థులు అతడిని నిలదీసేందుకు హెడ్ కానిస్టేబుల్ ఇంటికి . దీంతో ఆగ్రహానిక గురైన కారు తీసి వేగంగా వారి ఢీకొట్టేందుకు యత్నించాడు. ఈ క్రమంలోనే రాజు కారు బానెట్‌పై పడగా.. అతడిని అలాగే 100 మీటర్ల దూరం లాక్కెళ్లాడు. బాధితులు ఫిర్యాదు మేరకు జ్ఞానేశ్వర్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.