'నేను మందుతాగలే.. అదిగో ఆయణ్ని ఊదమనండి' - తెలంగాణ తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video

Drunken man hulchal in Hyderabad : హైదరాబాద్ కంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం మత్తులో ఒక వ్యక్తి హల్చల్ చేశాడు. ఫలక్‌నుమా పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఓ కారును తనిఖీంచాలనుకున్న పోలీసులు ఆ కారు డ్రైవ్ చేస్తున్న వ్యక్తి చలాకీతనాన్ని చూసి స్టన్ అయ్యారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్న చెక్‌పోస్టు వద్దకు రాగానే.. ఆ వాహనాన్ని డ్రైవ్ చేసే వ్యక్తి.. డ్రైవింగ్ సీట్లో తన పక్కన ఉన్న వ్యక్తిని కూర్చోబెట్టాడు.
ఇది గమనించిన పోలీసులు ఆ వాహనాన్ని ఆపారు. వేరే సీట్లో కూర్చున్న వ్యక్తిని బ్రీత్ ఎనలైజర్‌లో ఊదమని పోలీసులు అడిగారు. కానీ ఆ వ్యక్తి పోలీసులకు సహకరించకుండా వారితో వాగ్వాదానికి దిగాడు. పోలీసులు ఎంత అడుగుతున్నా సహకరించకున్నా.. అతను గొడవకు దిగి 'డ్రైవర్ సీట్లో కూర్చున్న వ్యక్తిని తనిఖీ చేయండి..నేను మాత్రం బ్రీత్ ఎనలైజర్‌లో ఊదనని' వారితో గట్టిగా మాట్లాడటం మొదలు పెట్టాడు. అసభ్య పదజాలంతో పోలీసులను దూషించాడు. చివరికి పోలీసులు ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసి వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.