Prathidwani: 'విడాకుల నిబంధనలు, ప్రక్రియలో ఎలాంటి మార్పులు రానున్నాయి'
🎬 Watch Now: Feature Video
Prathidwani: విడాకుల అంశంపై కీలక తీర్పు వెలువరించింది సుప్రీం కోర్టు. కలసి జీవించలేని పరిస్థితుల్లో.. భార్యభర్తలు ఇద్దరి సమ్మతి ఉంటే వెంటనే విడాకులు ఇవ్వడానికి కోర్టులకు సాధ్యమే అని తెలిపింది. ఐదుగురు సభ్యుల ధర్మసనం ఈ మేరకు తీర్పునిచ్చింది. ఇద్దరి అంగీకారం ఉన్నప్పుడు అందుకు ఆరు నెలలు ఆగాల్సిన అవసరం లేదని.. ఆ నిబంధనను సడలించింది న్యాయస్థానం. పెళ్లి రద్దు చేసి తక్షణ విడాకులు మంజూరుకు అవకాశం కల్పించింది. దంపతులు ఇద్దరు అంగీకరిస్తే తక్షణమే విడాకులు మంజూరు చేసుకొవచ్చని తీర్పు ఇచ్చింది. గతంలో దంపతులు కలసి జీవించేలేనప్పుడు.. కోర్టును ఆశ్రయించి ఇరు అభిప్రాయాలు తీసుకొని ఆరు నెలలు గడువు ఇచ్చేవారు. అప్పటికి వారి అభిప్రాయం మారకపోతే విడాకులు ఇచ్చేవారు. ఇప్పుడు ఆ పద్దతిని సుప్రీం కోర్టు తాజాగా రద్దు చేసింది. అసలు ఏ నేపథ్యంలో సుప్రీం కోర్టు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది? విడాకుల నిబంధనలు, ప్రక్రియలో ఎలాంటి మార్పులు రానున్నాయి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.