One Crore Cost Sarees Seized in Hyderabad : బాచుపల్లిలో పట్టుబడ్డ రూ.కోటి విలువగల పట్టుచీరలు .. రెండు లారీల సరుకు సీజ్ - తెలంగాణ తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video


Published : Oct 18, 2023, 7:06 PM IST
One Crore Cost Sarees Seized in Hyderabad : ఎన్నికల వేళ రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల అధికారులు, పోలీసులు కలిసి ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో అక్రమంగా తరలిస్తున్న నగదు, ఆభరణాలు, డ్రగ్స్, మద్యంతో పాటు ఇతర విలువైన వస్తువులు భారీగా పట్టుబడుతున్నాయి. ఇవాళ నగర శివారు ప్రాంతాల్లోని బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు లారీల పట్టు చీరలు పట్టుబడ్డాయి.
ప్రగతి నగర్ పంచవటి అపార్ట్‌మెంట్స్‌లో చీరలను రెండు లారీల నుంచి డంపు చేస్తుండగా పోలీసులు పట్టుకుని పోలీస్ స్టేషన్కి తరలించారు. ఈ పట్టు చీరలు వరంగల్లో మాంగళ్య షాపింగ్ మాల్స్ నుంచి కొనుగోలు చేసినట్లు కాశం పుల్లయ్య చెబుతున్నారు. కానీ సరైన పత్రాలు చూపక పోవడంతో పోలీసులు కేసు నమోదు చేసి లారీలను స్టేషన్కి తరలించారు. వీటి విలువ రూ. కోటి వరకూ ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.