తండ్రి ద్విచక్ర వాహనం కొనివ్వడం లేదని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లా కోహెడ మండలం రామచంద్రపూర్ లో చోటుచేసుకుంది.సిద్దిపేట జిల్లా కోహెడ మండలం రామచంద్రపూర్ కు చెందిన ఉమ్మరవేని అజయ్ (18) తండ్రి ఎల్లయ్యను ద్విచక్రవాహనం కొనివ్వాలని కోరాడు. ఎల్లయ్య కొడుకు కోరికను నిరాకరించారు. మనస్తాపం చెందిన అజయ్ గత గురువారం సాయంత్రం ఇంట్లో ఎవరు లేని సమయంలో పురుగుల మందు తాగాడు. గమనించిన తండ్రి వెంటనే అజయ్ ని సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.పరిస్థితి విషమించటంతో హైదరాబాద్ లోని డెక్కన్ ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ శనివారం మరణించాడు.