వివాహ వేడుకకు వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగి వ్యక్తి మృతి చెందిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌళ్లరామారంలో చోటుచేసుకుంది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగుడూరు మండలం చౌళ్లరామారం శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. గ్రామానికి చెందిన బండారి నరేశ్ , చింతల కృష్ణమూర్తి ద్విచక్రవాహనంపై నల్గొండ జిల్లా కట్ంగూరు మండలం ఈదులూరులో స్నేహితుడి పెళ్లికి వెళ్లారు. తిరిగి వస్తున్న క్రమంలో... ఎదురుగా వస్తున్న కారు ఢీ కొనటం వల్ల ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన నరేశ్ అక్కడికక్కడే మృతి చెందాడు. కృష్ణమూర్తికి గాయాలు కాగా... తిరుమలగిరి ఆస్పత్రికి తరలించారు. మార్గమధ్యలోనే కృష్టమూర్తి తుదిశ్వాస విడిచాడు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఇదీ చదవండీ : మాజీ ఎంపీ నంది ఎల్లయ్య మరణం పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్య సంతాపం